Tuesday, 22 April 2014

ammavaaru (అమ్మవారు)


వేసవిలో(ఎండాకాలంలో) అమ్మవారు రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు


  • వేప పువ్వు మరియు లేత వేప ఆకు(ఎర్రనిది) అన్నంతో కాని లేదా వేరె ఏ ఆహారంతో ఐనా తినిపించాలి.
  • ఎక్కువగా కుండలోని నీటినే తాగించండి.
  • రాత్రి కుండలో అన్నం వండి దానిలో పెరుగు తోడు పెట్టిన పాలని పోసి, ఉదయం మొదటిగా ఇది తినిపించి తర్వాత ఎమైనా తినవచ్చు. ఇది వొంట్లో వేడిని తగ్గిస్తుంది.


అమ్మవారు వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు


  • తెల్లని వస్త్రం పరచి దానిపై వేప ఆకులు పరచి వాటిపై ఇంకో తెల్లని వస్త్రం పరచి పిల్లలను దానిపై పడుకోపెట్టాలి. ఇది బ్యాక్టిరియాను అరికడుతుంది.
  • పొక్కులు చిదమకుండా వాటిపై గందం రాయాలి.
  • అరి పాదాలకు గోరింటాకు పూసి కట్టు కట్టాలి. ఇది కళ్ళలో పొక్కులు రాకుండా కాపాడుతుంది.

Saturday, 23 November 2013

Lettuce Peanut gaarelu పాలకూర శనగ గారెలు

పాలకూర శనగ గారెలు




శనగలు: 200 గ్రా||
పాలకూర: 2 కట్టలు
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిర్చి: 6
జీలకర్ర: 1 Tea spoon
వాము: 1/4 Tea spoon
కరివేపాకు: 4 రెమ్మలు
ఉల్లిపాయలు: 2
ఉప్పు, నూనె: సరిపడ

తయారుచేయు విధానము:

ముందుగా శనగలను శుభ్రంగా కడిగి ఒకరోజు ముందు నానబెట్టుకోవాలి (శనగలకు బదులుగా శనగ పప్పును కూడా తీసుకోవచ్చు). నానిన శనగలను తయారికి ముందుగా కచ పచగా రుబ్బుకోవాలి. అల్లం, మిర్చి కలిపి పాలకూరను, ఉల్లిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. శనగల మిశ్రమంలో పాలకూర, ఉల్లి, జీలకర్ర, వాము, కరివేపాకు, తగినత ఉప్పు వేసి కలపాలి. కావాలనుకుంటె కొంచెం బియం పిండి కలిపి గారెల మిశ్రమంలా తయరు చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బాంజి పెట్టి వేయించడానికి సరిపదా నూనె వేసి చిన్న చిన్న గారెలుగా చేసి మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. 

Friday, 20 September 2013

మొక్కజొన్న గారెలు (Corn Vada)

మొక్కజొన్న గారెలు



కావలసిన పదార్దాలు:

  1. మొక్కజొన్నపొత్తులు పెద్దవి -3
  2. పచ్చి మిరపకాయలు-5
  3. జీలకర్ర-1 స్పూన్
  4. కొత్తిమీర-1 కట్ట
  5. పుదీన-1 కట్ట
  6. కరివేపాకు-3 రెమ్మలు
  7. నువ్వులు-1 స్పూన్
  8. ఉప్పు-తగినంత
  9. బియ్యపు పిండి-1/2 కప్పు
  10. ఉల్లిపాయలు-1
  11. మంచి నూనె-వేయించదానికి సరిపడ


తయారుచేయు విధానము:


    మొక్కజొన్న గింజలను వొలిచి పెట్టుకోవాలి. దానిలో పచ్చి మిర్చి, ఉప్పు వేసి కచపచగా రుబ్బుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పుదీన, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి మొక్కజొన్న మిశ్రమంలో వేయాలి. జీలకర్ర, నువ్వులు, బియ్యపు పిండి కూడ వేసి గారెల పిండి లా కలుపుకోవాలి. చిన్న చిన్న గారెలలా వత్తుకొని కాగుతున్న నూనెలో దోరగా వేయించి తీయాలి.

Sunday, 8 September 2013

Give Hope Foundation

వినాయక చవితి ముందు రోజున, మా చైత్ర అక్షరాభ్యాసాన్ని పురస్కరించుకొని, పిల్లలకి బట్టలు, pens & snacks ఇచ్చాము. In this my journey, neighbor joined their hands with me by donating some cloths.







Saturday, 22 June 2013

ఉగ్గు తయారు చేయు పద్దతి (making of uggu)

ఉగ్గు తయారు చేయు పద్దతి (6 నెలల నుండి 2 సం||ల చిన్న పిల్లల కోసం)

కావలసిన పదార్దాలు:
1. 50gr బియ్యం
2. 50gr మినపప్పు
3. 25gr కంది పప్పు
4. 25gr పెసర పప్పు
5. 25gr చెనగ పప్పు
6. 20gr బాదం పప్పు
7. 20gr జీడి పప్పు

తయారు చేయు విధానము:

1. జీడి పప్పు బాదాం పప్పు కాకుండ మిగిలినవన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవలి. తరవాత అన్ని పప్పులని (జీడి పప్పు + బాదాం పప్పు లతొ సహా) దోరగా వేఇంచుకొని పొడి చెయాలి. దీనిని గాజు సీసాలొ నిలువ చేసుకోవలి.

2. ఒక కప్పు పాలకి రెండు టీ చెంచాల పొడి అవసరం అవుతుంది. ముందుగా పాలను వేడి చేసుకొని అవి మరుగుతున్నప్పుడు, పొడిని నీటితొ కలిపి మరుగుతున్న పాలలో ఈ మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా దగ్గర అయ్యెంతవరకు కలపాలి.

3. తినిపిచేప్పుడు సగం టీ చెంచా తేనెని కలిపి తినిపించాలి (తేనె అందుబాటులో లేనప్పుడు  నెయ్యి & ఉప్పు కలిపి కూడా తినిపిచవచ్చు).

Sunday, 28 April 2013

పళ్ళ చిగుళ్ళ నుండి రక్తం కారుట

పళ్ళ చిగుళ్ళ నుండి రక్తం కారుతున్నప్పుడు తుమ్మ చెట్టు (indian gum arabic tree) బెరడు తెచ్చి ఎండలో ఎండబెట్టి పొడి చేసి వారం రోజులపాటు ఉదయం పళ్ళు తొముకోవడానికి ముందు ఈ పొడితో తోముకొనండి. దీని వలన ఎలాంటి చెడు ప్రభావం ఉండదు (No side effects).

Saturday, 27 April 2013