మొక్కజొన్న
గారెలు
కావలసిన
పదార్దాలు:
- మొక్కజొన్నపొత్తులు పెద్దవి -3
- పచ్చి మిరపకాయలు-5
- జీలకర్ర-1 స్పూన్
- కొత్తిమీర-1 కట్ట
- పుదీన-1 కట్ట
- కరివేపాకు-3 రెమ్మలు
- నువ్వులు-1 స్పూన్
- ఉప్పు-తగినంత
- బియ్యపు పిండి-1/2 కప్పు
- ఉల్లిపాయలు-1
- మంచి నూనె-వేయించదానికి సరిపడ
తయారుచేయు
విధానము:
మొక్కజొన్న గింజలను వొలిచి పెట్టుకోవాలి. దానిలో పచ్చి మిర్చి, ఉప్పు వేసి కచపచగా
రుబ్బుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పుదీన, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి మొక్కజొన్న మిశ్రమంలో
వేయాలి. జీలకర్ర, నువ్వులు, బియ్యపు పిండి కూడ వేసి
గారెల పిండి లా కలుపుకోవాలి.
చిన్న చిన్న గారెలలా వత్తుకొని
కాగుతున్న నూనెలో దోరగా వేయించి తీయాలి.


No comments:
Post a Comment